ETV Bharat / city

మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై భాజపా మండిపాటు.. - ఏపీ తాజా వార్తలు

తెదేపా కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్​ను సోము వీర్రాజు చదువుతున్నారన్న మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. సోము వీర్రాజు రాసిన లేఖకు సమాధానం చెప్పలేకనే ఆరోపణలలు చేస్తున్నారని విమర్శించింది. మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది.

bjp fires on minister appalaraju
bjp fires on minister appalaraju
author img

By

Published : Sep 14, 2021, 12:22 PM IST

జీవో 217 విషయంలో.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెదేపా కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ చదువుతున్నారన్న మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. మంత్రి వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర శాఖ ఖండించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రికి రాసిన లేఖకు సమాధానం చెప్పలేక మంత్రి అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల పేరుతో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి... ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా కపట ప్రేమ నటిస్తోందని ఆరోపించింది. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయతలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనడానికి మంత్రి వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొంది.

ఇదీ చదవండి:రైతు సమస్యలపై తెలుగుదేశం పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.