పరిషత్ ఎన్నికల ప్రకటన విడుదలపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా.. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. తీర్పు రాకముందే నిర్ణయం తీసుకోవడాన్ని భాజపా వ్యతిరేకించింది.
'ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. గతంలో భాజపా-జనసేన చేసిన విజ్ఞప్తులను విస్మరించారు. హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.' - సోము వీర్రాజు
పరిషత్ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకోవడానికి ఎస్ఈసీ ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని జనసేన పార్టీ కూడా బహిష్కరించింది.
ఇదీ చదవండి: ఎస్ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: పవన్