ETV Bharat / city

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు: భార్గవరామ్​ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తారా?

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో 17 మంది నిందితుల బెయిల్​ పిటిషన్లను సికింద్రాబాద్​ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పరారీలో ఉన్న భార్గవరామ్​.. ముందస్తు బెయిల్​ పిటిషన్లను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

boyanapalle kidnap case
బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు
author img

By

Published : Feb 2, 2021, 10:21 AM IST

బోయిన్​పల్లి అపహరణ కేసులో 17 మంది నిందితుల బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ప్రవీణ్​రావు సోదరులను అపహరించిన కేసులో 17 మంది నిందితులను బోయిన్​పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

చంచల్​గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి తరఫున న్యాయవాదులు సికింద్రాబాద్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని.. కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసుల తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్​ను తిరస్కరించింది.

అపహరణ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్​రామ్, జగత్ విఖ్యాత్​రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఇప్పటికే తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం భార్గవ్​రామ్​.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఇవీచూడండి: బోయిన్​పల్లి పీఎస్​కు అఖిలప్రియ.. గంటన్నరపాటు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.