ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. కానీ.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు నడిచాయి. మెట్రో రైళ్లూ యథావిధిగా కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి.
ఉద్యోగాలకు వెళ్లే వారంతా రోజులాగే ఇళ్ల నుంచి బయలుదేరి కార్యాలయాలకు చేరుకున్నారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా బంద్‌లో పాల్గొనబోమని ఇదివరకే ప్రకటించింది.
- ఇదీ చదవండి : కెమెరాల అద్దె పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్