ETV Bharat / city

తెలంగాణలో నేడు బార్లు, మద్యం దుకాణాలు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని భాగ్యనగరంలో నేడు బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

మద్యం దుకాణాలు బంద్​
మద్యం దుకాణాలు బంద్​
author img

By

Published : Apr 16, 2022, 1:49 PM IST

liquor stores in hyd: హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలోని భాగ్యనగరంలో నేడు బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఇవాళ ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్​బండ్​ హనుమాన్ ఆలయం వరకు జరగనుందని వెల్లడించారు. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.

వీర హనుమాన్ విజయ యాత్ర ద్విచక్ర వాహన ర్యాలీ రూట్ మ్యాప్​ను సంబంధిత పోలీసు అధికారులను, నిర్వాహకులను సీపీ అడిగి తెలుసుకున్నారు. భజరంగ్ దళ్, వీహెచ్​పీ నాయకులతో కలిసి తాడ్​బండ్ వరకు చేరుకుని యాత్ర ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతకు ముందు సీపీతో పాటు నగర జాయింట్ సీపీ రమేశ్​రెడ్డి, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, బిక్షపతి రాంమందిర్​లో పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి..

తిరుమల శ్రీవారి సేవలో... హైకోర్టు సీజే

కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై తెదేపా నేతల మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.