కరోనా పరిస్థితుల్లో విద్యార్థులు గుమిగూడకుండా హాల్‌టికెట్‌లో పొందుపరిచిన బార్‌కోడ్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం (ఈ నెల 3న) జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2021) జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. కంప్యూటర్ల వద్ద విద్యార్థుల కోసం రఫ్ వర్క్ నోట్‌బుక్ ఉంచుతారు. మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష ప్రారంభమయ్యాక హాల్‌టికెట్‌తో పాటు కొవిడ్‌కు సంబంధించి స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వాలి. ఈ (JEE Advanced 2021) పరీక్ష(పేపర్-1, 2 కలిపి) మొత్తం ఎన్ని మార్కులకు, ఎన్ని ప్రశ్నలుంటాయని ముందుగా తెలియకపోవడం అడ్వాన్స్‌డ్ ప్రత్యేకత.
సీట్లు 16 వేలు.. పోటీపడేది 1.70 లక్షల మంది
అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2021) పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 25 వేలమంది విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో తెలంగాణ నుంచి సుమారు 14 వేల మంది ఉన్నారు. ఏపీలో 30, తెలంగాణలో 15 పట్టణాలు, నగరాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది అర్హత సాధించగా 1.70 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. అడ్వాన్స్‌డ్(JEE Advanced 2021)లో ఉత్తీర్ణులైన వారు దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లకు పోటీ పడొచ్చు. గత ఏడాది 16,061 సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి కనీసం మరో 500 వరకు పెరుగుతాయని తెలుస్తోంది. ఫలితాలను ఈ నెల 15న వెల్లడిస్తామని ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే ప్రకటించింది.
తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా
JEE Main 2021 Results: తెలుగు విద్యార్థుల హవా.. ఆరుగురికి మొదటి ర్యాంక్
JEE MAINS: జేఈఈ మెయిన్ ర్యాంకుల కోసం విద్యార్థుల నిరీక్షణ..
JEE Mains 2021: మెయిన్స్ ఫలితాలు నేడే.. అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు కూడా...