ETV Bharat / city

నైతిక విలువకు మారుపేరు బాలయోగి: చంద్రబాబు - balayogi 18th vardhanti news in telugu

లోక్​సభ స్పీకర్​గా పనిచేసిన బాలయోగి.. నైతిక విలువలకు మారుపేరుగా నిలిచారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో బాలయోగి 18వ వర్థంతి నిర్వహించారు. నివాళి అర్పించారు.

లోక్‌సభ మాజీ సభాపతి బాలయోగికి నివాళి అర్పించిన చంద్రబాబు

author img

By

Published : Mar 3, 2020, 7:32 PM IST

లోక్‌సభ మాజీ సభాపతి బాలయోగికి నివాళి అర్పించిన చంద్రబాబు

లోక్​సభకు స్పీకర్​గా విశేష సేవలు అందించిన తెదేపా నేత జీఎంసీ బాలయోగి 18వ వర్థంతిని అమరావతి ఎన్టీఆర్​ భవన్​లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నాపత్రం లీకేజీపై ఆరోపణలు వస్తే.. బాలయోగి వెంటనే రాజీనామా చేశారని గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధిలో అడుగడుగునా బాలయోగి ముద్రలు కనబడతాయని కీర్తించారు. ఆయన ఆశయ సాధనకు తెదేపా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కృష్ణా జిల్లా గొల్లపూడిలో..

బాలయోగి వర్థంతిని గొల్లపూడిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెదేపా నేతలతో కలిసి చిత్రపటానికి నివాళులర్పించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరంలోనూ బాలయోగి వర్థంతి నిర్వహించారు. కంబాల చెరువు పార్కులోని బాలయోగి విగ్రహానికి తేదేపా శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య స్థితి నుంచి దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిన నేత అని తెదేపా నాయకుడు గన్నికృష్ణ కీర్తించారు.

ఇదీ చూడండి:

మనసులో స్థానం.. ఇంట్లోనూ సగభాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.