ప్రజలు చేపట్టిన పనులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని గణపతి పూజ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అటు కరోనా, ఇటు వరదలు జనజీవనాన్ని దుర్భరం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల బాధ్యతారాహిత్యం ప్రజల సహనానికి పరీక్షగా మారిందన్న చంద్రబాబు... అన్నింటినీ అధిగమించేలా విఘ్నేశ్వరుని చల్లనిచూపు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... పర్యావరణానికి హాని కలగకుండా వినాయకచవితి వేడుకలను కుటుంబసభ్యులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
గణనాథుడి కరుణతో కరోనా కష్టాలు త్వరలో తొలగాలని ఆకాంక్షిస్తూ... ప్రజలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కొవిడ్ వైరస్ కష్టనష్టాలు తెచ్చిపెట్టినందున... ఆ విఘ్నాలు తొలగించాలని వినాయకుడిని ప్రార్థిద్దామని పిలుపునిచ్చారు. వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న దశలో సమూహంగా కాకుండా ఎవరి ఇంట్లో వారు వినాయకచవితిని జరుపుకోవాలని లోకేశ్ సూచించారు.
ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు