చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ ప్రవీణ్‌కుమార్ భౌతికకాయం ఆయన స్వగ్రామం రెడ్డివారిపల్లెకు చేరింది. దిల్లీ నుంచి భౌతిక కాయాన్ని భారతవైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తీసుకొచ్చారు. అక్కడ గవర్నర్ తరపున తిరుపతి ఆర్టీవో కనక నరసారెడ్డి నివాళులర్పించారు. మద్రాస్ రెజిమెంట్ సైనికులు, మాజీ సైనికులు పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి.
నినాదాల హోరు...
ప్రవీణ్ కుమార్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి భార్య, తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ క్రమంలో భార్య స్పృహ తప్పి పడిపోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జవాన్ పార్థివ దేహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. సుమారు కిలో మీటరు మేర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం నినాదాలతో హోరెత్తిపోయింది.
ఇదీ చదవండి