APPSC Exam Dates Released: రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్పీ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి 25 వరకు జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్‌టేబుల్ పొందుపర్చింది. మొత్తం డిపార్ట్మెంటల్ పరీక్షలకు 55,036 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
రాష్ట్రంలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జూలైలో ప్రాథమిక పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రాథమిక పరీక్ష తేదీలను మంగళవారం ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్ కుమార్ ప్రకటించారు. జూలై 24న దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష, జులై 31న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లను త్వరలో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: APPSC: ఉద్యోగాల భర్తీకి.. ప్రాథమిక పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ