ETV Bharat / city

మూడు బోర్డుల్లో గ్రూపు-1 ఇంటర్వ్యూలు... కారణం అదేనా..? - ఏపీ తాజా వార్తలు

Group -1: కమిషన్‌ సభ్యులకు ప్రాధాన్యం పెరిగేలా మూడు బోర్డుల ద్వారా గ్రూప్‌-1 ఇంటర్య్వూలను నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఒక బోర్డు ద్వారానే ఇంటర్య్వూలు జరుగుతుండగా... ఇప్పుడు కొత్త విధానాన్ని ప్రకటించింది. పైగా మాన్యువల్‌ మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్న తరుణంలో... ఈ షెడ్యూలును ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Group -1
గ్రూపు-1 ఇంటర్వ్యూలు
author img

By

Published : Jun 1, 2022, 7:41 AM IST

Group 1: ఏపీపీఎస్సీ కొత్త సంస్కృతికి తెరదీసింది. మౌఖిక పరీక్షల నిర్వహణ బోర్డుల వివరాలను ముందుగానే ప్రకటించింది. జూన్‌ 15 నుంచి 29వ తేదీ మధ్యన ఒక్కో బోర్డుకు రోజుకు పది మంది చొప్పున 30 మంది అభ్యర్థులకు మూడు బోర్డుల ద్వారా మౌఖిక పరీక్షలు జరగబోతున్నాయి. వీటివల్ల కమిషన్‌ సభ్యులకు ప్రాధాన్యం పెరిగింది. మూడు బోర్డుల ద్వారా తక్కువ వ్యవధిలో ఇంటర్వ్యూలు ముగిసే అవకాశం ఉన్నా.. మార్కుల కేటాయింపులో వ్యత్యాసాలు వస్తాయి. ఇప్పటివరకు గ్రూపు-1 మౌఖిక పరీక్షలను ఒక బోర్డే నిర్వహించేది. తొలిసారి.. బోర్డుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వివరాలను ఇంత ముందుగా ఎన్నడూ ప్రకటించిన దాఖలాలు లేవని అభ్యర్థులు చెబుతున్నారు. కిందటేడాది డిజిటల్‌ మూల్యాంకనం ద్వారా ఎంపికైన వారికి మౌఖిక పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించినప్పుడు ముందుగా బోర్డుల వివరాలు తెలుపలేదు.

ఫలితాల ప్రకటన వెలువడినప్పుడే మౌఖిక పరీక్షల తేదీలు ప్రకటించింది. అయితే... మౌఖిక పరీక్షల ప్రారంభానికి 45రోజుల వ్యవధి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఫలితాల వెల్లడిరోజే మౌఖిక పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే ఆగమేఘాలపై ఇంటర్వ్యూలను ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది. మాన్యువల్‌ మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ షెడ్యూలును మంగళవారం ఖరారు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బోర్డుల్లో కమిషన్‌ సభ్యులు ఉండటం తప్పనిసరి. ప్రతి బోర్డుకూ సీనియర్‌ సభ్యుడు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ప్రతి బోర్డులో సాధారణంగా ఐదుగురు సభ్యులుంటారు. వీరిలో సబ్జెక్టు నిపుణులు, ఆయా శాఖలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌లు ఉంటారు. ఈ బోర్డుల్లోని సభ్యులు ఏరోజుకారోజు మారుతారా.. వారే ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో ప్రకటించబోయే గ్రూపు-1 పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. కానీ... ఇంటర్వ్యూలు కావాలని సభ్యులు పట్టుబడుతున్నారు. దీనిపై ఇప్పటికీ తర్జనభర్జనలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో కమిషన్‌ సభ్యులకు ప్రాధాన్యం పెరిగేలా గ్రూపు-1 (2018 నోటిఫికేషన్‌) మౌఖిక పరీక్షలు మూడు బోర్డుల ద్వారా జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. బోర్డుల వివరాలు, ఏయే బోర్డుల్లో ఎవరెవరు ఉంటారన్నది ఇంటర్వ్యూల నిర్వహణకు ముందు మాత్రమే ఏపీపీఎస్సీలో అంతర్గతంగా నిర్ణయిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.