అమరావతిలో రైతుల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని రాష్ట్ర పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. పోలీసులను ఉపయోగించి జగన్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు, మహిళల పట్ల ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్లు చెప్పారు. మూడు రాజధానులు ముమ్మాటికి మంచిది కాదన్నారు. అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమంలో పాల్గొంటాయని తెలిపారు.ఇదీ చదవండి : 'ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయటం పిరికిపంద చర్య'