APNGOs On PRC: తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7నుంచి ఉద్యోగుల శంఖారావం ప్రారంభించబోతున్నట్టు ఏపీ ఎన్జీవో నేతలు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 10 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామని, 13న అన్ని చోట్లా నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలను జయప్రదం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కృష్ణా జిల్లా ఉద్యోగ సంఘ నేతల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు. 7 పెండింగ్ డీఎలను నిలిపివేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. సీపీఎస్ ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పటి వరకు చేయలేదని దుయ్యబట్టారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి:
Chettinad Chicken Recipe : సండే స్పెషల్.. నోరూరించే చెట్టినాడ్ చికెన్