రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తల కోసం ఏపీఐఐసీ శుభవార్త చెప్పింది. ఆన్లైన్ సేవల్ని తిరిగి ప్రారంభించింది. గడచిన నెలరోజులుగా నిలిచిపోయిన వెబ్సైట్లో సవరించిన భూమి ధరల్ని పేర్కొంటూ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఏపీఐఐసీ స్పష్టం చేసింది. ఏపీలో పెట్టుబడుల కోసం వచ్చే ఏ పారిశ్రామిక వేత్తకైనా ఒకే తరహాలో వివరాలు తెలిసేలా ఈ ఆన్ లైన్ విధానం ఉపకరిస్తుందని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. భూ కేటాయింపులు, ప్లాట్ల అనుమతుల కోసం పారిశ్రామిక వేత్తలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. మొత్తం 14 రకాల సేవల్ని ఒకే దరఖాస్తుతో అందిస్తున్నట్టు ఏపీఐఐసీ వెల్లడించింది. వెబ్ సైట్లో ఎంటర్ ప్రెన్యూర్ లాగిన్ తో పరిశ్రమల పేర్ల మార్పులు, కేటాయింపుల బదిలీ లాన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిస్రమకు చెందిన కేటగిరీలు, సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఎన్ ఓసి లాంటి అంశాలను ఈ సేవల ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ కీలక ఆదేశాలు..