ETV Bharat / city

ap topnews ఏపీ ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

.

9am topnews
ఏపీ ప్రధానవార్తలు9am
author img

By

Published : Oct 4, 2022, 8:58 AM IST

  • అభివృద్ధి పేరుతో ప్రైవేటు పరం..

రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్ట్‌లు ప్రైవేట్‌పరం కానున్నాయి. ఒకప్పుడు ఎంతో ఆదాయాన్ని ఆర్జించిన హోటళ్లు, రెస్టారెంట్‌లు, కాటేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకు రుణంతో వీటిని మరింత అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతూనే.. మరోవైపు వీటిని అప్పనంగా అప్పగించేందుకు టెండర్లు సైతం పిలిచింది.

  • పరిమితులకు మించి అప్పులు..

దసరా పండుగ అంటేనే సందడి. కానీ, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో పండుగ కళ కనిపించడం లేదు. నాలుగో తారీఖు వచ్చినా చాలా మందికి ఇంకా జీతాలే అందలేదు. వేతనాలు అందకుండా వేడుకలు ఎలా చేసుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉద్యోగులది. మరోవైపు.. అప్పు తెస్తే కానీ, జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకే తాజాగా మరో 2 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి సేకరించింది.

  • దుర్గమ్మ రూపంలో అమ్మవారి దర్శనం... తెప్పోత్సవంపై సందిగ్ధత

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు.. దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. మూలానక్షత్రం రోజున దాదాపు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే తెప్పోత్సవంపై సందిగ్ధం కొనసాగుతోంది.

  • వైకాపాలో విభేదాలు.. యూత్ కన్వీనర్​పై దాడి... ఎక్కడంటే..?

సత్తెనపల్లిలో వైకాపా వర్గీయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా యూత్ కన్వీనర్​పై మరో వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కళ్లలో కారం చల్లి... మరో వర్గం దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

  • డీజీపీ దారుణ హత్య.. ఇంట్లోనే మృతదేహం తగలబెట్టే యత్నం.. అతడిపైనే డౌట్

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన పని మనిషిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • రూ.45 చోరీ కేసులో 24ఏళ్లకు తీర్పు.. వృద్ధుడికి శిక్ష.. ఎంత కాలం అంటే..

ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 కొట్టేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నేరం చేశానని అంగీకరించిన వృద్ధుడికి 4 రోజుల జైలుశిక్ష వేసింది ఉత్తర్​ప్రదేశ్​ మైన్​పురిలోని న్యాయస్థానం.

  • రష్యాకు 'సైనిక సమీకరణ' కష్టాలు.. వేలాది మంది వెనక్కి.. కారణమదే!

రష్యాకు సైనిక సమీకరణ తిప్పలు తప్పడం లేదు! తాజాగా ఇక్కడి ఖబరోవ్స్క్‌ ప్రాంతం నుంచి సైన్యంలో చేరేందుకు పిలుపు వచ్చిన వేలమందిని అధికారులు వెనక్కు పంపారు. కారణం.. వారు ఆర్మీ కనీస ప్రమాణాలు అందుకోకపోవడమే.

  • బ్యాంకింగ్ యాప్‌లకు 'సోవా' ముప్పు.. అప్రమత్తంగా ఉండాల్సిందే!

పండగల వేళ.. ఇ-కామర్స్‌ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు డిజిటల్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్‌ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి ఫోన్​లో ఉన్న సమాచారాన్ని దోచేస్తున్నారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని బ్యాంకులు.. తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

  • జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఏపీ జోరు.. 'తెలుగు' అథ్లెట్లకు పతకాల పంట

జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల చక్కటి ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం తెలంగాణ మూడు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు రెండు రజతాలు, మూడు కాంస్యాలు దక్కాయి.

  • ''గాడ్​ ఫాదర్'​లో పది సర్​ప్రైజ్​లు!.. త్వరలోనే నాగ్​-అఖిల్​తో యాక్షన్​ మల్టీస్టారర్​!'

'హనుమాన్‌ జంక్షన్‌' చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా. తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత 'గాడ్‌ఫాదర్‌'తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.