ETV Bharat / city

ప్రధానవార్తలు@11am

.

9am topnews
ప్రధానవార్తలు
author img

By

Published : Sep 22, 2022, 10:59 AM IST

  • ఏపీని ముంచబోతున్న అప్పులు.. కాగ్ నివేదికల్లో వాస్తవాలు

"మేం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మొన్నే సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఇంతలోనే అందుకు విరుద్ధంగా ఉన్నకంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు కాగ్‌ తేల్చిచెప్పింది.. రుణాలను భరించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని స్పష్టం చేసింది. పాత రుణాలు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించింది . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అద్దె చెల్లించలేదని ఆర్టీసీ బస్టాండ్​ మూసివేత

అద్దె చెల్లించలేదంటూ కడప నగరపాలక సంస్థ అధికారులు ఆర్టీసీ బస్టాండ్‌ను మూసేశారు. ఉదయం నుంచి..బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా ఆపేశారు. అద్దె చెల్లించాలని ఆర్టీసీ అధికారులకు సూచించినా.. స్పందించకపోవడం వల్ల బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా మూసేశారు. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బావిలో దూకి దంపతుల ఆత్మహత్య...

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో వ్యవసాయ బావిలో పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజమండ్రికి చెందిన దూళి శ్రీను కసింకోట మండలానికి చెందిన దూళి చిన్నారి ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇటీవల కసింకోటకు వచ్చిన వీరిద్దరూ అత్తవారింటి వద్ద గొడవపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేడెక్కిన ఈడీ విచారణ.. ఇక నుంచి దిల్లీ కేంద్రంగా..

దిల్లీ మద్యం ముడుపుల కేసులో ఈడీ విచారణ వేడెక్కుతోంది. తనిఖీల్లో బయటపడిన వివరాల ఆధారంగా.. అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఫార్మా సంస్థకు చెందిన ప్రముఖుడితో పాటు.. రెండు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందిన సంచాలకులు, వెన్నమనేని శ్రీనివాస్‌రావును విచారించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,443 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 26 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,291 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...

15 ఏళ్ల బాలిక పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు ఐదుగురు కామాంధులు. ఆమెను వివస్త్రను చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​ మొరాదాబాద్​లో సెప్టెంబర్ 1న జరిగిందీ దురాణం. ఆమె నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న వీడియోను ఓ మహిళ సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా.. అనేక రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచ ఆహార భద్రతకు అమెరికా భారీ సాయం..

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆహార సంక్షోభాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 2.9 బిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించారు. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు, ఐరాస సర్వప్రతినిధి సభలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగన్‌. భారత్‌-పాక్‌ల నడుమ ఇంతవరకూ శాంతి నెలకొనలేదని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలుగు రాష్ట్రాల కుబేరులు వీళ్లే.. దివీస్ అధినేత మురళిదే అగ్రస్థానం

తెలుగు రాష్ట్రాల్లో రూ.1,000 కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ తేల్చింది. వీరి మొత్తం సంపద విలువ రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ.56,200 కోట్ల ఆస్తులతో దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి కె.దివి అగ్రస్థానంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీమ్ ఇండియాలో ​కీలక మార్పులు.. ఆ ముగ్గురు ఇన్​.. వీళ్లు ఔట్​!

సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత్​ ఓటమి పాలైంది. భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆసీస్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో రెెండో మ్యాచ్​లో గెలిచి పోటీలో ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది టీమ్ ఇండియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'లైగర్'​ ఓటీటీ మే ఆ గయా... వెండితెరపై 'ది ఘోస్ట్​'

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్లకు డిస్నీ+హాట్‌స్టార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.