- ఉగ్రమూలాల అనుమానంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్ఐఏ తనిఖీలు..
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్ఐఏ సోదాలు సోదాలు చేస్తోంది. నెల్లూరు జిల్లా ,బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్‌లో పీఎఫ్ఐ కేసులో నిందితులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండగా..ఓ వర్గం ప్రజలు ఎన్ఐఏ అధికార్లను అడ్డుకున్నారు.
- అమరావతి మున్సిపాలిటీకి 5గురు అనుకూలం.. 22 గ్రామాలు వ్యతిరేకం..
అమరావతి మున్సిపాల్టీ ఏర్పాటుపై గ్రామసభలు ముగిశాయి. 6 రోజులపాటు 22 గ్రామసభలు జరగ్గా.. అన్నిచోట్లా మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ది చేయాలని తెలిపాయి. మున్సిపాల్టీ ఏర్పాటుతో తమకు ఒరిగేదేమి లేదంటూ ప్రభుత్వ ఎత్తుగడను రాజధాని గ్రామాల ప్రజలు తిప్పికొట్టారు.
- Death trap రుణ యాప్‌కు మరో విద్యార్ధి బలి.. మార్ఫింగ్ ఫొటో తల్లిదండ్రులకు చేరడంతో ఆత్మహత్య..
రవీంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు. అవసరాలకోసమంటూ.. యాప్‌లో రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం తిర్చాలంటూ తన తమ్ముడి చరవాణికి అసభ్య సందేశాలు పంపించారు నిర్వాహకులు. అదే విషయమై తల్లిదండ్రులు రవీంద్రనాథ్ని నిలదిశారు . మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- అనకాపల్లిలో కలవరం.. బుసలు కొట్టిన 15 అడుగుల గిరినాగు
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో మరో గిరినాగు కలకలం రేపింది. స్థానికులు.. ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు కొన్ని గంటల పాటు శ్రమించి గిరినాగును పట్టుకున్నారు. ఈ పాము పొడవు 15 అడుగులు ఉంటుందని అధికారులు తెలిపారు.
- చీతాలకు ఇంత వేగం ఎలా? శరీరంలోని ఆ ప్రత్యేకతలే కారణమా?..
అరుదైన వన్యప్రాణులైన చీతాలు సుధీర్ఘ కాలం తర్వాత భారత్‌కు వచ్చాయి. నమీబియాలోని విండ్‌హాక్ నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి తీర్చిదిద్దిన ఈ పరుగుల యంత్రం దేహనిర్మాణ క్రమాన్ని పరిశీలిద్దాం.
- అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం
పంజాబ్‌లోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఓ విద్యార్థిని తమ సహచరుల ప్రైవేట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిందని ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్.. దోషుల్ని వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
- అలాంటి పాత్రలు చెయ్యొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు: హీరో శర్వానంద్
తల్లి-కొడుకు సెంటిమెంట్‌తో ఇటీవలే విడుదలైన చిత్రం 'ఒకే ఒక జీవితం' . శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్.. పలు విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
- 'నా భర్తను చాలా మిస్సవుతున్నా'.. అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్ వైరల్!..
టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.. తాజాగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది. 'నా భర్తను చాలా మిస్సవుతున్నా' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలు ఎందుకు అనుష్క.. విరాట్‌ను మిస్ అవుతుందంటే?
- ఆరోగ్య బీమా సంస్థల ఆగడాలకు చెక్! ఇకపై పాలసీలన్నీ ఒకేచోట
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. ఆరోగ్య బీమా లేకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కరోనా తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది.. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అధిక ప్రీమియం వల్ల కొందరు పాలసీ తీసుకునేందుకు ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్డీఏఐ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
- బ్రిటన్ జెండాకు భారీ డిమాండ్.. చైనాకు పోటెత్తిన ఆర్డర్లు..
బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూసిన తర్వాత ఆ దేశంలో జాతీయ జెండాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. యూకేతోపాటు కామన్వెల్త్ రాజ్యాలైన ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లోనూ జెండాలు భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాకు భారీగా ఆఫర్లు పోటెత్తాయి.