ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM - టాప్​ న్యూస్​

.

11AM TOPNEWS
ప్రధానవార్తలు @11AM
author img

By

Published : Jul 27, 2022, 10:59 AM IST

Updated : Jul 27, 2022, 11:11 AM IST

  • దేశంలో కొత్తగా 18 వేల కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 18,313 మంది వైరస్ బారిన పడగా.. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. జపాన్​, జర్మనీల్లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. జపాన్​లో కొత్తగా 1.54 లక్షల మందికి కరోనా సోకగా.. జర్మనీలో 1.21 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భాజపా యువనేత దారుణ హత్య.. నిందితుల్ని వదిలిపెట్టబోమని సీఎం ట్వీట్​

భాజపా యువ మోర్చా నాయకుడు ప్రవీణ్​(32) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని నెట్టారు ప్రాంతంలో మంగళవారం జరిగింది. దుండగులు మూకుమ్మడిగా దాడి చేయగా.. ప్రవీణ్​కు తీవ్రగాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జక్కంపూడికి జనసేన సెగ.. పిచ్చి వేషాలెయ్యొద్దంటూ ఎమ్మెల్యే హెచ్చరిక

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన సెగ తగిలింది. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు ఎటూ చాలదని.. రూ.10వేల చొప్పున ఇవ్వాలనే డిమాండుతో సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. ముఖ్యమంత్రి పర్యటించే పి.గన్నవరం మండలం జి.పెదపూడి వద్దకు జనసేన వీర మహిళలు చేరుకోవాలని ప్రయత్నించినా పోలీసుల ఆంక్షలతో కుదరలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమ్మఒడి డబ్బు వృథా చేస్తున్నారు.. ఎమ్మెల్యేకు మహిళ హితవు

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి డబ్బులను జనం వృథాగా ఖర్చు చేస్తున్నారు. అవే డబ్బులతో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా అని ఓ మహిళ అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో.. భాగంగా నిర్మల ఇంటి ముందుకు ఎమ్మెల్యే వెళ్లినప్పుడు.. ఎమ్మెల్యేతో ఈ విషయాన్ని ప్రస్తావించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోఆపరేటివ్‌ బ్యాంకు ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల హవా

హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారులు విజయం సాధించారు. కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ తెదేపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో వెంటనే కొందరు ఫిర్యాదు చేయండతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేయండ చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విదేశీ బట్టలు వద్దన్నందుకు లారీతో తొక్కించి..

అతనో నిరుపేద యువకుడు. బట్టల మిల్లులో కార్మికుడు. ఎప్పుడో కానీ రెండుపూటలా భోజనం చేయలేడు. మూడు జతల దుస్తులు, భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆయన ఆస్తులు. దేశభక్తిలో మాత్రం తనని మించిన ధనికులు లేరు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఒంటిపై ఉన్న విదేశీ దుస్తులను కాల్చేశాడు. తన ప్రాణాలనూ తృణప్రాయంగా బలిచ్చాడు. తప్పుకొనేందుకు అవకాశమున్నా తన పేరు తరతరాలకు గుర్తుండేలా రక్తతర్పణం చేశాడు. అతడే.. భరతమాత ముద్దుబిడ్డ బాబూ గేను సేద్‌. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయం

అమరరాజా గ్రూపు అనుబంధ సంస్థ మంగళ్‌ ఇండస్ట్రీస్‌.. రానున్న మూడేళ్లలో రూ.3,000 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఎగుమతులపై దృష్టి సారించడంతో పాటు, ఏరోస్పేస్‌, రక్షణ, వైద్య పరికరాల తయారీ రంగంలోకి ప్రవేశించబోతున్నట్లు సంస్థ డైరెక్టర్‌ హర్షవర్ధన గౌరినేని తెలిపారు. విస్తరణ కోసం మూడు - అయిదేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీవీ డిబేట్​లో రిషి, ట్రస్‌ మాటల యుద్ధం.. ఆర్థిక అంశాలు, పన్నులపై వాగ్వాదం!

బ్రిటన్​ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్​, లిజి ట్రస్​ మధ్య ఓ టీవీ డిబేట్​లో మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక అంశాలు, పన్ను ప్రణాళికపై ఇద్దరి మధ్య వాగ్వాదం హోరాహోరీగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎవరూ బాగా మాట్లాడారన్నదానిపై 'ఒపీనియం' సంస్థ నిర్వహించిన పోల్​లో.. సునాక్‌కు 39 శాతం ఓట్లు రాగా ట్రస్‌ వైపు 38 శాతం మంది మొగ్గారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వెస్టిండీస్‌తో చివరి వన్డే.. క్లీన్‌స్వీప్​పై ​ కన్నేసిన భారత్​

జోరుమీదున్న టీమ్‌ ఇండియా మరో పోరాటానికి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో చివరిదైన మూడో వన్డే బుధవారం జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ చేజిక్కించుకున్నభారత్​.. క్లీన్‌స్వీప్‌ చేయాలని తహతహలాడుతుండగా.. గట్టిగానే పోరాడినా రెండు ఓటములు చవిచూసిన విండీస్‌ ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి ఊరట పొందాలనుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'రవితేజ అలా కనిపిస్తారు.. అందుకే 'రామారావు' టైటిల్‌ పెట్టా'

రవితేజ హీరోగా రూపొందిన సినిమా 'రామారావు ఆన్‌ డ్యూటీ'. శరత్‌ మండవ దర్శకుడు. వాస్తవ సంఘటలనల ఆధారంగా యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్‌ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : Jul 27, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.