ETV Bharat / city

ప్రధానవార్తలు @11AM - ఏపీ టాప్​ న్యూస్​

.

11AM TOPNEWS
ప్రధానవార్తలు @11AM
author img

By

Published : Aug 7, 2022, 10:59 AM IST

  • షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ..

ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెల్లింది. తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు దీన్ని ప్రయోగించారు. ఈ వాహకనౌక ఈవోఎస్‌-02, ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉమ్మడి నోటిఫికేషన్లతో ఉద్యోగాల భర్తీ!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో తొలిసారిగా ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా పారా మెడికల్‌ నియామకాలు జరుగుతున్నాయి. ఈ శాఖలో ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధానపరిషత్‌ (ఏపీవీవీపీ) డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రుల్లో ఉండే పోస్టులకు హెచ్‌ఓడీ కార్యాలయాలు గతంలో విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేసేవి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రహ్మోత్సవాలకు సర్వదర్శనమే.. తొలిసారి అమలు చేస్తున్న తితిదే

కరోనా అనంతరం తొలిసారిగా మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 27నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వస్తారని తితిదే అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చమురు తెట్టును తినేస్తాయి.. సరికొత్త పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన ఎన్​ఐఒటీ

సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తెట్టులను తొలగించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. సముద్ర జీవులపై పరిశోధనలు చేసే చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఒటీ) శాస్త్రవేత్తలు నాలుగేళ్లుగా పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. సముద్ర అంతర్భాగాలకు చేరుకొనే ఎలాంటి హైడ్రోకార్బన్లను అయినా హానికారకం కాకుండా చేయవచ్చని కనుగొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​, దక్షిణ కొరియాలో మాత్రం..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 18,738 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 18,558 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రియుడి ఇంట్లో వివాహిత అలా.. మహిళను తాళ్లతో కట్టేసి దేహశుద్ధి!

ప్రియుడి వద్దకు వెళ్లిన ఓ వివాహితను గ్రామస్థులు బంధించి హింసించారు. తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశారు. బాయ్​ఫ్రెండ్​ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళకు దేహశుద్ధి చేశారు గ్రామస్థులు. తాళ్లతో కట్టేసి బంధించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ సిద్ధార్థ్​నగర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • న్యూయార్క్​లో భారత మహిళ ఆత్మహత్య..

కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. 'ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా' అంటూ అందులో వాపోయింది. తన బాధలను పంచుకుంటూ.. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్‌ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరిగిన బ్యాంకు రుణాలు.. గతేడాది కంటే 14 శాతం అధికం

బ్యాంకు రుణాల్లో ఆకర్షణీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఒక పక్క అధిక ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువలో క్షీణత, ఆర్థిక వ్యవస్థకు లోటు భారం పెరుగుతుందనే ఆందోళన వంటి సవాళ్లు ఉన్నప్పటికీ రుణాల్లో వృద్ధి చోటు చేసుకోవటం ఆసక్తికరమైన పరిణామంగా ఉంది. గత నెల 15 నాటికి మనదేశంలో బ్యాంకులు జారీ చేసిన రుణాల మొత్తం రూ.122.8 లక్షల కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పురుషుల హాకీ జట్టు జోరు.. ఉత్కంఠ విజయంతో కామన్వెల్త్ ఫైనల్​కు..

భారత్ పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. బర్మింగ్​హోమ్​ వేదికగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో కామన్వెల్త్​ గేమ్స్ 2022 ఫైనల్​కు చేరింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే అభిషేక్‌ గోల్‌ కొట్టడం వల్ల భారత్‌ ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మణ్​దీప్‌ సింగ్‌ మరో గోల్​తో మెరవడం వల్ల భారత్‌ 2-0తో పటిష్ఠ స్థితికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ హీరో ఘటికుడు.. అవమానాలను దాటి.. ఆకాశమే హద్దుగా చెలరేగి

టాలీవుడ్​లో బలమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో ఒకరిగా.. బలమైన అభిమాన గణమున్న హీరోల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా కూడా ఆయనకు మంచి పేరు ఉంది. ఇటీవలే ఆయన నేడు 'ఆకాశమే హద్దురా!' అంటూ జాతీయ ఉత్తమనటుడి స్థాయికి వెళ్ళగలిగాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.