ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ తాజా వార్తలు

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 9, 2020, 4:59 PM IST

  • ఏలూరును వీడని కలవరం...585కు చేరిన బాధితులు
    అంతు చిక్కని వ్యాధితో ఏలూరు సతమతమవుతోంది. తాజాగా మరికొంతమంది ఈ వ్యాధి బారిన పడటంతో... మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. అయితే కొత్త కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతోందని అధికారులు వెల్లడించారు. ప్రజల అస్వస్థతకు కారణాలపై వివిధ సంస్థలు పరిశోధిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై సర్కారు తీరు దారుణం: పవన్
    ఏలూరులో వింత వ్యాధి వల్ల వందల మంది ఆస్పత్రుల పాలయ్యారు. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. బాధితుల కోసం తగిన వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రి ప్రాతినిధ్యం ఉన్న ఏలూరులో పిల్లలకు ఐసీయూ లేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్
    హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో అదనంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యమని... సీఎం జగన్ వివరించారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదు.. రైతు కన్నీరు తుడవండి'
    ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాకుండా.. రైతు కన్నీరు తుడిచి వెంటనే పరిహారం అందించి.. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'మోదీ సంస్కరణలు దొంగతనంతో సమానం'
    మోదీ హయాంలో జరుగుతున్న సంస్కరణలు దొంగతనంతో సమానమని కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. అందుకే దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి
    గూగుల్​లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీవర్డ్​గా 'ఐపీఎల్' నిలిచింది. ఈ సంవత్సరం హాట్​ టాపిక్​గా ఉన్న 'కరోనా వైరస్​'తో పోలిస్తే ఐపీఎల్​తోనే ఎక్కువ సెర్చ్​లు జరిగాయని గూగుల్ వెల్లడించింది. మొత్తంగా భారతీయులు ఈ ఏడాది వేటిని ఎక్కువగా శోధించారనే అంశంపై జాబితా రూపొందించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఆ విద్యార్థికి ఐఐటీ సీటు తిరిగిచ్చేయండి'
    18ఏళ్ల సిద్ధాంత్​ బాత్రాకు అతని ఇంజినీరింగ్​ సీటు తిరిగిచ్చేయాలని ఐఐటీ బాంబేను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు మధ్యంతర అడ్మిషన్​ అవకాశాన్ని కల్పించాలని సూచించి విచారణను వాయిదా వేసింది. జేఈఈ ఎడ్వాన్సడ్​​లో 270 ర్యాంక్​ సాధించిన సిద్ధాంత్​.. ఓ తప్పు లింక్​ క్లిక్​ చేయడం వల్ల సీటును ఉపసంహరించుకున్నానని తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఆమిర్ తనయుడితో 'అర్జున్​ రెడ్డి' బ్యూటీ
    ఆమిర్ ఖాన్​ తనయుడు జునైద్ తొలి సినిమాలో హీరోయిన్​గా శాలిని పాండే కనిపించనుంది. యశ్​ రాజ్​ ఫిల్మ్ బ్యానర్​పై సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అంజూ.. పతకంతో పాటు మనసుల్ని గెలిచింది అలా!
    ప్రపంచ అథ్లెటిక్స్​లో పతాకం గెల్చుకున్న ఏకైక అథ్లెట్ అంజూ బాబీ జార్జ్. అయితే దేశ చరిత్రలో గుర్తుండిపోయే విజయాల్ని తాను ఒక్క కిడ్నీతోనే సాధించినట్లు ఆశ్చర్యకర నిజాన్ని చెప్పింది. తన క్రీడా ప్రయాణంలోని ఆసక్తికర విషయాల్ని ఈ సందర్భంగా వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • తగ్గిన పసిడి ధర- తాజా లెక్క ఇలా..
    అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.118 పడిపోయి.. రూ. 49,221కి పరిమితమైంది. వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ. 875 పతనమై.. రూ.63,410కి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.