పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విజయవాడలో ఫలితాలు విడుదలచేస్తారు. 2019 తర్వాత కొవిడ్ కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు నిర్వహించగా 6,21,799 మంది విద్యార్థులు రాశారు. ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నారు. పదో తరగతి ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడంపై నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ తెలిపారు. ర్యాంకులు ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని అన్నారు.
ర్యాంకులు ప్రకటించొద్దు : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను మభ్యపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రూ.లక్ష వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: