సౌర, పవన విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాస్‌రెడ్డి... కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్‌కు లేఖ రాశారు. ఈ ఒప్పందాల వల్ల ఏటా రూ.5 వేల కోట్ల భారం మోయాల్సి వస్తోందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇవి మరింత భారంగా మారాయని వివరించారు. పీపీఏల వల్ల డిస్కంలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయని బాలినేని తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. సంక్షోభ పరిష్కారానికి కేంద్ర విద్యుత్ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేయాలని సూచించారు. డిస్కంల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని... సౌర, పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం రాయితీ ఇవ్వాలని బాలినేని లేఖలో కోరారు.
ఇదీ చూడండి: