కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... రోజుకు 20 వేలు చొప్పున నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం అధిక సంఖ్యలో ట్రూనాట్ కిట్లను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్ని ప్రైవేట్ వైద్యకళాశాలల్లోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులిచ్చేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ట్రూనాట్ కిట్లలో పరీక్షలు చేసిన అనంతరం ఆర్టీపీసీఆర్కు పంపుతుండగా... ఇకపై ఆ అవసరం ఉండబోదని అధికారులు అంటున్నారు. కొత్త తరహా ట్రూనాట్ కిట్లలో ఇకపై ఏ ఫలితమొస్తే అదే అంతిమమని స్పష్టం చేశారు. దీని వల్ల సమయం ఆదా కావడమే కాక.. పరీక్షల సంఖ్య సైతం పెరుగుతుందని భావిస్తున్నారు.
రెండింటికి ఐసీఎంఆర్ అనుమతి
విజయవాడలోని అపోలో, మణిపాల్ ల్యాబుల్లోనూ నమూనాలు పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆమోదం లభించింది. ప్రస్తుతం పరీక్షల సంఖ్యలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: