తెలంగాణ రాష్ట్ర ఈసెట్‌లో ర్యాంకులు పొందిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈసారి ఇక్కడ ప్రవేశాలు కల్పించడం లేదు. వారిని కౌన్సెలింగ్‌కు అనుమతించకూడదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఏపీలో పాలిటెక్నిక్ చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించనందున కౌన్సెలింగ్‌కు ధ్రువపత్రాలు ఉండవని, అందువల్ల ఆ రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం వీలుకాదని అధికారులు పేర్కొంటున్నారు.
ఈసారి ఈసెట్‌కు 23,667 మంది హాజరవగా.. 22,522 మంది అర్హత సాధించారు. వారిలో సుమారు 1,500 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కేంద్రంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే.. ఈసారి అనుమతి లేదని అధికారులు వారికి తేల్చిచెప్పారు. తాము ప్రాసెసింగ్ ఫీజు రూ.1,200 చెల్లించామని, తీరా కౌన్సెలింగ్‌కు వస్తే అనుమతి లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయా జిల్లాల విద్యార్థులు ప్రశ్నించారు.
ఇదీ చూడండి: కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు- 72 మంది మృతి