ETV Bharat / city

Strike: మేము సైతం సమ్మెకు.. సై అన్న ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు

author img

By

Published : Jan 29, 2022, 6:32 AM IST

పీఆర్సీకీ సంబంధించి రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతుండగా.. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ap prc strike
ap prc strike

ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. కొన్ని జిల్లాల్లో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన దీక్షలకు ఉద్యోగినులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బీఆర్టీఎస్‌ రోడ్డులో రాష్ట్రవ్యాప్తంగా వేల మందితో సభ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఇదేసమయంలో పాత జీతాలే చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు ఉద్యోగులు లక్షల అభ్యర్థన పత్రాలను సమర్పించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎంఈవోలకు, స్కూల్‌ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులకు పత్రాలను ఇచ్చారు.

గిరిజన గురుకులాల ఉపాధ్యాయుల మద్దతు

పీఆర్సీ సాధన సమతి ఉద్యమానికి తాము మద్దతు తెలియజేస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర, పొరుగు సేవల సిబ్బంది తెలిపారు.

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం

ఏదోవిధంగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వానికి మూడు డిమాండ్లపై ఇప్పటికే స్పష్టంగా లేఖ ఇచ్చాం. ఐఆర్‌ను ఇచ్చినట్లు ఇచ్చే వెనక్కి తీసుకున్న చరిత్ర ప్రభుత్వానిది. ఇంత దారుణంగా ఉద్యోగ సంఘాలను అవమానపర్చడాన్ని ఎప్పుడూ చూడలేదు. జీతాలు చెల్లించకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసహనం వచ్చి, ఉద్యమం నీరుగారుతుందని భావిస్తున్నారేమో.. అదేమీ ఉండదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలనే ఇవ్వాలి. మేం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎవరికీ లొంగలేదు. మా వెనుక ఉద్యోగులు తప్ప ఎవరూ లేరు.

-ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

మీరు మెట్లు దిగాల్సిన అవసరంలేదు

మీరు మెట్లు దిగాల్సిన అవసరం లేదు. మీ పీఠంపైనే కూర్చోండి. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలంటే మూడు డిమాండ్లు అమలు చేసి, చర్చలకు పిలవండి. సినిమాటిక్‌, నాటకీయ ప్రకటనలు పక్కనపెట్టి, ఆచరణాత్మక పరిష్కారం చూడాలి. సర్కారు వేసిన కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదు. కేవలం మాతో చర్చించి, ఆ విషయాలను సీఎంకు చెప్పే కమిటీ మాత్రమే. మా డిమాండ్లను సాకుగా చూపి జీతాలను ఆపేందుకు, ఆ డబ్బులను పథకాలకు మళ్లించుకునేందుకు ఇలా చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. కాగితాలపై పుట్టుకొచ్చిన సంఘాలతో చర్చించి, న్యాయం చేసినా మంచిదే.

-ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర

బండి శ్రీనివాసరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగ సంఘాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. నాలుగు ఐకాసలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రెండో రోజైన శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ అంటూ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నారు. నాలుగు సంఘాలు ఏకతాటిపై ఉన్నాయి. జీతాలు చెల్లించేందుకు కొందరు డీడీవోలు, కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పరిధి దాట్టొదు.. మీ ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలి. మాకు పాత జీతాలు ఇస్తే చాలు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తాం’ అని స్పష్టంచేశారు.

ఉద్దేశపూర్వకంగా కరపత్రాలు

మాకు, ప్రజలకు మధ్య యుద్ధం కల్పించాలనే ఉద్దేశంతో కరపత్రాలు ముద్రించారు. ఆర్టీసీ, వైద్యశాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కొవిడ్‌ సమయంలో వైద్యం అందక ఎవరైనా చనిపోతే దానికి ప్రభుత్వానిదే బాధ్యత.

-ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి

డీడీవోలపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మె

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

.

పీఆర్సీపై ప్రభుత్వం సామరస్య పూర్వకంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొడుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. చర్చల పేరిట కొన్ని సంఘాలను పిలిపించి మాట్లాడినంత మాత్రాన ఆ సంఘాలు ఉద్యమాన్ని ఆపుతాయా? అని ప్రశ్నించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని ఖజానా ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వారిపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం భోజన విరామ సమయంలో... రివర్స్‌ పీఆర్సీని నిలిపేయాలని నినాదాలు చేస్తూ వెనక్కి నడిచారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ‘‘కొత్త జీతంలో అయిదు డీఏలు కలపడంవల్ల కొంత జీతం పెరిగితే, ఉద్యోగులు నిరసన తెలపరని భావిస్తున్నట్లుంది. ఉద్యోగులు అమాయకులు కాదు. పీఆర్సీపై చర్చల పేరిట కొన్ని సంఘాలను ప్రభుత్వం వేసిన కమిటీ పిలిపించుకుని మాట్లాడింది. ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకురావాలన్నదే వారి ఉద్దేశం. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజూ కనీసం వంద మంది పాల్గొంటారు’’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: New Districts in AP : నూతన జిల్లాల ఏర్పాటుపై .. ఆరని నిరసన జ్వాలలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.