ETV Bharat / city

'ఇండియన్‌ పోర్టు బిల్లు'పై ఏపీ మారిటైం బోర్డు అభ్యంతరాలు - Indian‌ Port Bill-2020 news

కేంద్రం నూతనంగా తీసుకొస్తున్న 'ఇండియన్‌ పోర్టు‌ బిల్లు-2020'లో రాష్ట్రాలకు నష్టం కలిగించే అంశాలను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ బిల్లు అమలు చేయడమంటే అన్ని పోర్టుల నిర్వహణ కూడా కేంద్రం చేతుల్లోకి వెళ్లడమేనని పేర్కొంది. ఈ చట్టంపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలని స్పష్టం చేసింది.

indian-port-bill
ఇండియన్‌ పోర్టు‌ బిల్లు-2020
author img

By

Published : Jan 18, 2021, 5:24 AM IST

కేంద్రం ప్రతిపాదించిన 'ఇండియన్‌ పోర్టు బిల్‌- 2020'తో చిన్న ఓడరేవుల ఏర్పాటుకు అనుమతులను జారీ చేసే అధికారం కేంద్రం
చేతుల్లోకి వెళ్తుందని ఏపీ మారిటైం బోర్డు అభిప్రాయపడింది. ఈ బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ కేంద్రానికి ఇటీవల లేఖ రాసింది. 'కొత్తగా ప్రతిపాదించిన చట్టం వల్ల చిన్న నౌకాశ్రయాలు నిర్వహించాలన్నా, మూసేయాలన్నా నిర్ణయాధికారం కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. ఈ చట్టంపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చించాలి. బిల్లులో ప్రతిపాదించిన మార్పులతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుంది. దేశవ్యాప్తంగా చిన్న ఓడరేవులపై నియంత్రణకు 'మారిటైం పోర్టు రెగ్యులేటరీ అథారిటీ' ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న మారిటైం బోర్డులతో ప్రయోజనం ఉండదు. రాష్ట్ర బోర్డులు తీసుకున్న నిర్ణయాలను కొత్త రెగ్యులేటరీ అథారిటీ సమీక్షించాల్సి వస్తుంది.

ఫలితంగా చిన్న ఓడరేవుల అభివృద్ధికి కేంద్రం రూపొందించే ప్రణాళికలో పక్షపాత ధోరణికి అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న సముద్ర తీరం వెంట వాటర్‌ ఫ్రంట్‌ వరకు ఉన్న భూమిపై హక్కులు రాష్ట్రానికే ఉంటాయి. దీని అభివృద్ధిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. కాని, ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను దెబ్బతీసేలా ఉంది. సాంకేతిక, వాణిజ్య అంశాలతో సంబంధం లేకుండా పోర్టుల అభివృద్ధిని కేంద్రం విస్మరించవచ్చు. ఈ సందర్భంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి బిల్లులో సూచించిన అంశాల్లో లోపాలు ఉన్నాయి' అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఓడరేవుల మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. ఉమ్మడి జాబితాలో చేర్చిన కార్మిక, పారిశ్రామిక, ఇంధన చట్టాల మాదిరిగానే మారిటైం చట్టాల ద్వారా నియంత్రణ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని అందులో ప్రస్తావించింది.

రాష్ట్రాల హక్కులు దెబ్బతినే ప్రతిపాదిత బిల్లుతో సముద్ర తీరం అభివృద్ధిపై రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నీ కేంద్రానికి దాఖలు పడతాయని ఏపీ మారిటైం బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 'ఈ చట్టంలోని సబ్‌ క్లాజ్‌-5 ప్రకారం చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు నుంచి పనిచేసే అన్ని పోర్టులు రెండేళ్ల తర్వాత కేంద్రం అనుమతితోనే నిర్వహించాలి. ఇది ప్రైవేట్‌ డెవలపర్లతో ఇప్పటికే కుదుర్చుకున్న దీర్ఘకాలిక రాయితీ ఒప్పందాలకు విరుద్ధం. ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని చిన్న ఓడరేవులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులోని అంశాలు ఇందుకు అవరోధంగా ఉన్నాయ'ని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విద్యుత్ ఛార్జీలపై నేటి నుంచి అభిప్రాయ సేకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.