గతంలో పనిచేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని హైకోర్టు(high court)లో దాఖలైన వ్యాజ్యలపై విచారణ జరిగింది. బిల్లులు(bills) చెల్లింపు వ్యవహారంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది హాజరయ్యారు. బిల్లులు చెల్లించలేదని కోర్టులకు వచ్చిన గుత్తేదారులు ఇరువురికి పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు.
అభ్యంతరం లేని బిల్లు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని.., దానికి సంబంధిత నివేదికను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి..