ETV Bharat / city

రాష్ట్రాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు తీసుకోవడంపై హైకోర్టులో విచారణ వాయిదా

author img

By

Published : Aug 26, 2021, 4:46 PM IST

Updated : Aug 26, 2021, 7:12 PM IST

ap-hc
ap-hc

16:44 August 26

తెదేపా నేత వెలగపూడి రామకృష్ణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

రాష్ట్రాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు తీసుకోవడంపై విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా 25 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాదులు బసవ ప్రభు పాటిల్, యలమంజుల బాలాజీలు వాదించారు. ప్రజాధనాన్ని కన్సాలిడేట్ ఫండ్​కు కాకుండా నేరుగా స్టేట్ కార్పొరేషన్​లోకి మళ్లిస్తున్నారని అన్నారు.

రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాజ్యం వేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కన్సాలిడేట్ ఫండ్ నుంచే నిధులు వెళుతున్నాయని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది.. ఈ కేసులో మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని పిటిషనర్ న్యాయవాది కోరారు . దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కేసు విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. 

ఇదీ చదవండి: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు- పంజ్​షేర్ నేతకు చోటు!

Last Updated : Aug 26, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.