కరోనా కేసులు పెరుగుతున్నందున కోర్టు విధుల్లో మార్పులు చేశారు. హైకోర్టు, దిగువ కోర్టుల్లో 50శాతం సిబ్బంది రోజు విడిచి రోజు పనిచేసేలా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్ల ర్యాంక్ కలిగిన జాయింట్ రిజిస్టార్లు , న్యాయమూర్తుల పీఎస్‌లు రోజూ విధులకు హాజరు కావాలన్నారు. ఇతర కేటగిరిలకు చెందిన సిబ్బంది 50 శాతం మంది రోజు విడిచి రోజు విధులకు హాజరుకావచ్చన్నారు, జ్యుడీషియల్ సెక్షన్లలో ఎంత మంది సిబ్బంది ఉండాలనే విషయంపై రిజిస్ట్రార్ జ్యుడీషియల్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రిజిస్ట్రార్లు ఆదేశించినప్పుడు సిబ్బంది హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా జడ్డీలు కోర్టు నుంచి గానీ, అధికారిక నివాసం నుంచి గానీ విధులు నిర్వహించవచ్చని వివరించారు.
ఇదీ చదవండి: విశాఖ నుంచి మహారాష్ట్రకు బయల్దేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్