ETV Bharat / city

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్న దృష్ట్యా నిధులు విడుదల చేసినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది. విశాఖ మెడ్​టెక్​ జోన్ ఛైర్ పర్సన్​గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల
ఏపీ హైగ్రేడ్ స్టీల్స్​ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల
author img

By

Published : Sep 21, 2020, 11:06 PM IST

ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్​కు రూ.50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న దృష్ట్యా సంస్థ వ్యూహాలు, మార్కెట్ రీసెర్చి, కన్సల్టెంట్లు, ఇంజినీరింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు విడుదల చేసినట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కడపలో హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వివిధ సంస్థల ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.

విశాఖలోని మెడ్​టెక్ జోన్ ఛైర్ పర్సన్​గా పరిశ్రమలశాఖ కార్యదర్శి కరికాల వలెవన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్థానంలో వలెవన్​ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి : మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం..బర్తరఫ్​ చేయాలని విపక్షాలు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.