రహదారి నిర్మాణ ప్రాజెక్టుల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తైన పనికి నేరుగా బ్యాంకుల ద్వారానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపేలా రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టుల వారీగా కాంట్రాక్టర్ల జాబితాను బ్యాంకుల అందజేయాల్సిందిగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకూ చెల్లించాల్సిన నిధుల వివరాలను బిల్లులతో సహా సీఎఫ్ఎంఎస్ ద్వారా బ్యాంకులకు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా రహదారి అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ఖాతాకు నిధులు విడుదల చేసి.. అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ఖాతాలకు జమ కానుందని రవాణా శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి
మహారాష్ట్ర తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో.. తెలుగోడి పాట