ETV Bharat / city

12 శాతం వడ్డీతో జీతాలు కోరుకోలేదు: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

కరోనా వల్ల వాయిదా వేసిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని తాము కోరుకోలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తెలిపింది. కరోనా వల్ల ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తాము 12 శాతం వడ్డీతో జీతాలు ఎలా తీసుకోగలమని పేర్కొంది. ఈ విషయాన్ని ఉద్యోగులతో చర్చించి కోర్టులో అప్పీల్ చేస్తామని ఉద్యోగుల సంఘం తెలిపింది.

12 శాతం వడ్డీతో జీతాలు కోరుకోలేదు : ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

author img

By

Published : Aug 13, 2020, 11:38 PM IST

కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెల 50 శాతం జీతాన్ని 12 శాతం వడ్డీతో తాము కోరుకోలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తెలిపింది. ఈ విషయంపై తమ కమిటీలో చర్చించి కోర్టులో అప్పీల్ కు వెళ్తామని స్పష్టం చేసింది. ఎవ్వరికైనా ఇబ్బంది ఉంటే వారు కోర్టుకు వెళ్లి ఉండవచ్చు... అయితే ఉద్యోగుల తరపున కోర్టుకు వెళ్లే అధికారం ఎవరికి ఇవ్వలేదని ఉద్యోగుల సంఘం పేర్కొంది.

కరోనా కాలంలో ఉద్యోగులు పనిచేసినా చేయకపోయినా ప్రభుత్వం జీతాలు చెల్లిచిందని గుర్తు చేసింది. కరోనా ఇబ్బందులు కారణంగా వాయిదా వేసిన 50 శాతం జీతాన్ని 12 శాతం వడ్డీతో ఎలా తీసుకోగలమని సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. కరోనా కాలంలో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా జీతాలను వాయిదా వేశాయని, కోత విధించాయని చెప్పారు.

ఇదీ చదవండి:

హైకోర్టు స్టేటస్​కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.