ETV Bharat / city

మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రైతులు నష్టపోకుండా మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 1 నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. అలాగే మిషన్​ గోడౌన్స్​ పేరుతో గోదాముల నిర్మాణం చేపడతామని తెలిపారు.

cm jagan
cm jagan
author img

By

Published : Mar 18, 2020, 8:51 PM IST

తాడేపల్లిలో మీడియాతో మంత్రి కన్నబాబు

ఏప్రిల్ 1 నుంచి జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. మార్కెట్​లో సరైన ధర లభించకపోవటంతో తక్షణమే వీటిని కొనుగోలు చేయాలని సీఎం జగన్​ ఆదేశించారని మంత్రి తెలిపారు. మార్కెటింగ్​ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి కన్నబాబు మీడియాకు వెల్లడించారు.

రబీ సీజన్​లో 15 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 50 శాతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. గోదాముల్లో నిల్వ కోసం ఎఫ్‌సీఐతో చర్చిస్తున్నామని కన్నబాబు చెప్పారు. కరోనా వల్ల పంట ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని తెలిపిన కన్నబాబు... దీనిపై ముఖ్యమంత్రితో చర్చించామని అన్నారు. 2020-21 సంవత్సరంలో మిషన్ గోడౌన్స్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రతి మండలంలో కోల్డ్​ స్టోరేజీలు నిర్మాణం చేపడతామని కన్నబాబు పేర్కొన్నారు. దీనికి తొలిదశలో రూ.321 కోట్లను సీఎం మంజూరు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర, కేంద్ర గోదాముల నిల్వ సామర్థ్యం కూడా పెంచుతామని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ సీజన్​లో సాగునీటి ఎద్దడి లేకుండా సీలేరు నుంచి మరో వెయ్యి క్యూసెక్కుల నీరు వాడుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.