మున్సిపల్ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ఆంగ్ల భాషలో నైపుణ్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియా రీజనల్ డైరెక్టర్ టీకె అరుణాచలం పరస్పరం అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఎంఓయూ జరిగింది. పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆంద్ల భాషా నైపుణ్యం పెంపొందించేలా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి: తెదేపా