ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల గడువును డిసెంబరు 17వ తేదీ వరకూ పొడిగించినట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ముందుగా డిసెంబరు 15 వరకే ఈ గడువు ఉందని.. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు రెండు రోజులు పెంచినట్టు మంత్రి వెల్లడించారు. బదిలీ కావాల్సిన 76,119 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. తప్పనిసరి బదిలీ(కంపల్సరీ ట్రాన్స్ఫర్)కావాల్సిన ఉపాధ్యాయులు 26 వేల మంది, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కింద 46,818 మంది కూడా వెబ్ అప్షన్లు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. మొత్తంగా 90 శాతం మంది తమ ఎంపికలను ఇచ్చారని తెలిపారు.
ఆ ఘనత చంద్రబాబుదే
బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు టీకప్పులో తుపాను మాత్రమేనని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య వివాదాన్ని రగిల్చేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ఉద్యోగులపై లాఠీ ఛార్జి చేసి, గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
సీపీఎస్‌పై త్వరలో నిర్ణయం
మరోవైపు సీపీఎస్ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. సీపీఎస్ రద్దు అంశంపై రెండు కమిటీలు అధ్యయనం చేస్తున్నారన్న ఆయన.. పాత పింఛను విషయంలో త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామన్నారు.
ఇదీ చదవండి