ETV Bharat / city

బడ్జెట్​పై ఆర్డినెన్స్​ తెచ్చే యోచనలో ప్రభుత్వం..? - cm jagan take ordinance on budget

కరోనా ప్రభావంతో పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన తరుణంలో రాష్ట్రంలో బడ్జెట్​ సమావేశాల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్​ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనిపై సమీక్షించిన సీఎం జగన్​.. బడ్జెట్​పై ఆర్జినెన్స్​ జారీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్​పై ఆర్డినెన్స్​ తెచ్చే యోచనలో ప్రభుత్వం..?

author img

By

Published : Mar 24, 2020, 4:55 AM IST

రాష్ట్ర బడ్జెట్​పై ఆర్డినెన్స్​ జారీ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కరోనా ప్రభావం కారణంగా పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను అర్ధంతరంగా నిరవధిక వాయిదా వేసిన పరిస్థితిని రాష్ట్ర సర్కారు పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభ బడ్జెట్​ సమావేశాలను నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. వీటిపై ముఖ్యమంత్రి జగన్​.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం తదితరులతో సమీక్షించారు. 2004లో బడ్జెట్​పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ జారీ చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కరోనా వ్యాపిస్తోన్న ప్రస్తుత తరుణంలో పార్లమెంటు సమావేశాలే వాయిదా పడితే.. అసెంబ్లీని నిర్వహించగలమా అన్న చర్చ జరిగినట్లు తెలిసింది. అందువల్ల రెండు వ్యయాల కోసం ఆర్డినెన్స్​ జారీ చేసి.. పరిస్థితులు కొలిక్కి వస్తే అప్పుడు శాసనసభ బడ్జెట్​ సమావేశాలను నిర్వహించడం బాగుంటుందేమోనన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం.

రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడితే

ఈనెల 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్​ ఉంది. దీనిలో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలందరూ ఆ రోజున శాసనసభకు రావాలి. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు​ వాయిదా పడితే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలను కూడా తాత్కాలికంగా నిలిపివేయవచ్చన్న అంశంపైనా సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలనూ నిలిపివేసే ప్రకటన జారీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికల పోలింగ్​ యథావిధిగా జరిగితే 27 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి:

కరోనా అలర్ట్... ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.