ETV Bharat / city

కొత్త జిల్లాల ఏర్పాటుకు భౌగోళిక చిక్కులు..! - కొత్త జిల్లాల ఏర్పాటు తాజా వార్తలు

జిల్లాల పునర్విభజన పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జరిగే అవకాశం కనిపించడం లేదు. భౌగోళికంగా, సాంకేతికంగా తలెత్తున్న ఇబ్బందులు పునర్విభజన అంశాన్ని ప్రభావితం చేయనున్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినా.. కొన్ని కీలకమైన అంశాలు కొత్త జిల్లాల ఏర్పాటులో అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భౌగోళిక, ఆర్థిక, సహజ వనరుల అసమానతలు కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Ap new districts
Ap new districts
author img

By

Published : Nov 13, 2020, 8:16 PM IST

పార్లమెంటు నియోజకవర్గాలనే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టులో వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాతిపదికన 25 నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి పాలనాపరమైన అంశాల్లో భాగంగా సిబ్బంది పంపకం, కేటాయింపు, బాధ్యతల పరిధి తదితర విషయాలు క్లిష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. ఇక భౌగోళికంగా జిల్లాల విభజన విషయంలోనూ సరిహద్దుల వివాదాలపై రాష్ట్రస్థాయి, ఉప సంఘాలు, జిల్లా కమిటీల్లో తీవ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం.

కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజవర్గాలు ఉండటం వంటి అంశాలు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదాయ పరంగానూ కొన్ని అంశాలు కమిటీలకు తలనొప్పిగా మారాయి. గనులు, ఆదాయార్జన వనరులు ఉన్న ప్రాంతాలు, అవి లేని ప్రాంతాల మధ్య ఆర్థిక అంశాలు పెద్ద వివాదంగా మారే అవకాశముందని సమాచారం. దీంతో ఈ అంశాలను రాజకీయ నిర్ణయానికే వదిలేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది.

మరోవైపు క్షేత్రస్థాయిలోని జిల్లా కమిటీలు, ప్రాంతీయ కమిటీలు కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. సొంత భవనాలు, అద్దె భవనాలు వివరాలను సేకరించారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అంశంపై ఇప్పటికే నివేదికలు రాష్ట్రస్థాయి కమిటీకి పంపించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలీసు శాఖకు సంబంధించి కూడా 29 యూనిట్లు ఏర్పాటు అయ్యే అవకాశముంది. ఇప్పటికే ఉన్న రెండు పోలీసు కమిషనరేట్లకు అదనంగా మరో ఐదు చోట్ల కమిషనరేట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి

తన భూమి వైకాపా నేత ఆక్రమించారని రైతు ఆత్మహత్యాయత్నం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.