ETV Bharat / city

పురోగతికి వడ్డీలే అవరోధం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌ - నీతి అయోగ్ సమావేశంలో జగన్

సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానే పారిశ్రామికాభివృద్ధిలో దూసుకెళ్లగలమని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని ప్రధానిని కోరారు.

ap cm jagan attend  niti aayog meeting
ap cm jagan attend niti aayog meeting
author img

By

Published : Feb 20, 2021, 12:24 PM IST

Updated : Feb 21, 2021, 4:13 AM IST

దేశాన్ని ఉత్పత్తి, తయారీ రంగాలకు కేంద్రంగా మార్చాలన్న లక్ష్యానికి.. అధిక వడ్డీలు, అధిక విద్యుత్‌ ఛార్జీలు, భూసేకరణలో జాప్యం, అనుమతుల మంజూరులో సంక్లిష్టత వంటి అంశాలు అవరోధంగా మారాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సంప్రదింపులతో సంస్కరణలు తేవాలని, అవరోధాల్ని తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ‘మౌలిక వసతుల కల్పన కోసం పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణానికి రాష్ట్ర ప్రభుత్వాలే 10-11% వడ్డీ కడుతున్నాయి. ప్రభుత్వాలకే ఈ పరిస్థితి ఉంటే, ఇక ప్రైవేటు రంగం గతేంటో ఆలోచించండి. ఇంత వడ్డీలు మోస్తూ ఉత్పత్తి, తయారీ రంగం ఎలా పురోగమిస్తుంది? తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2-3%కు మించి లేవు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ ఛార్జీ యూనిట్‌కి రూ.3 కంటే తక్కువే ఉంది’ అని జగన్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్
  • సీఎం జగన్ ప్రస్తావించిన, కేంద్రాన్ని కోరిన అంశాల్లో ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే..

ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి
రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సానుకూల పరిస్థితులు కల్పించడంతో పాటు, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో సాధించాల్సింది చాలా ఉంది. విభజనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ప్రథమశ్రేణి నగరం ఒక్కటీ లేదు. మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనతో పాటు, రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా పుంజుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏపీకి బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామని విభజనకు ముందు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ప్రకటించారు.
సవరించిన అంచనాల్ని ఆమోదించాలి
సాగునీటి రంగానికి అండగా నిలిచే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల్ని కేంద్రం వెంటనే ఆమోదించాలి. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందుల్నే అందుబాటులోకి తేవాలి. పంటల నిల్వ, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌లో కొత్త పరిజ్ఞానాల్ని అలవర్చుకోవడంతో పాటు, రైతులు తమ పంటల్ని సరైన ధరకు పొలం వద్దే అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రానప్పుడు ప్రభుత్వమే ఆదుకునేలా స్థిరీకరణ నిధి ఏర్పాటుకు తక్కువ వడ్డీకే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు అందేలా చూడాలి. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందాలి. సాగు విస్తీర్ణమూ పెరగాలి. ఈ చర్యల వల్ల వ్యవసాయరంగం బలోపేతమై రైతుల ఆదాయం రెట్టింపవుతుంది.
రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీతో విద్యుదుత్పత్తి
ఖర్చులు తగ్గించుకునేందుకు సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాం. 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు టెండర్‌ ప్రక్రియ చేపట్టాం. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌ రూ.2.48కే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్‌ విద్యుత్‌ను సగటున రూ.5.20కు కొంటున్నాం. రివర్స్‌ పంపింగ్‌ టెక్నాలజీ ద్వారా మరో 33 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నాం. కేంద్రం చొరవ తీసుకుని ఈ తరహా విద్యుత్‌ ఉత్పత్తికి జాతీయస్థాయిలో ఒక విధానం రూపొందించాలి. దీనికోసం తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించాలి.
కొత్త వైద్య కళాశాలలకు ఆర్థిక సహాయం
వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి నాడు-నేడు అమలు చేస్తున్నాం. 10 వేలకుపైగా విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌ ప్రారంభిస్తున్నాం. 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో మూడింటికి కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది. మిగతా 13 కశాశాలలకు అనుమతివ్వడంతో పాటు, ఆర్థిక సహాయం కూడా చేయాలి. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ఏడాదిపాటు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా ఒక విధానం తీసుకురావాలి.

పరస్పర సహకారంతో నడుద్దాం

కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఉన్న అవకాశాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పరిశీలించాలి.
* కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు పనితీరు ఆధారంగా రాయితీలు ఇస్తున్నాం.
* దారిద్య్ర నిర్మూలన, ఆర్థిక పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీలకం. విద్యుత్‌, రహదారులు, నౌకాశ్రయాలతో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి అంశాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.
* పాలనలో సంస్కరణలు తెచ్చాం. పరిపాలన వికేంద్రీకరించాం. టెక్నాలజీని వాడుకుంటున్నాం. అవినీతి, వివక్షకు తావులేకుండా పథకాలు అమలు చేస్తున్నాం.
* గ్రామస్థాయిలో ప్రతి పౌరుడికీ, ప్రభుత్వ వ్యవస్థకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం. గ్రామాల్లో పబ్లిక్‌ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటుచేసి వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం.

నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్

ఇదీ చదవండి:

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

Last Updated : Feb 21, 2021, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.