రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా అంశంపై మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, ప్రభుత్వ శాఖల సమన్వయం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పంచాయితీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ - ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా తాగునీటి సరఫరాపై సభ్యులు చర్చిస్తున్నారు. సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ హాజరయ్యారు.
రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా అంశంపై మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, ప్రభుత్వ శాఖల సమన్వయం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పంచాయితీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
cabinet meeting
Conclusion: