రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెుత్తం 22 అంశాలపై కీలకంగా చర్చించారు. 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు కేబినెట్ తీర్మానించింది. ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు
- బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి ఆమోదం
- 6 కోట్లకు పైగా అంచనాలతో వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేయాలని నిర్ణయం
- 44,500 పాఠశాలల్లో నాడు నేడు పథకాన్ని మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయం
- రాయలసీమ కరవు నివారణ కోసం ప్రతేకంగా రూ.40వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానం
- సీపీఎస్ రద్దు కోసం టీచర్లు చేసిన ఆందోళనపై గతంలో పెట్టిన కేసులు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం
- గుంటూరు1 పోలీసు స్టేషన్‌పై దాడి చేశారని ముస్లిం యువతపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నిర్ణయం