ETV Bharat / city

రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు - ఏపీ కేబినేట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కొత్త జిల్లాల అధ్యయనానికి అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ కరవు నివారణే లక్ష్యంగా గోదావరి నీటిని సీమకు తరలింపునకు ప్రభుత్వం రంగం చేసింది. రూ.40 వేల కోట్లతో నీటి తరలింపు పనులు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

author img

By

Published : Jul 15, 2020, 5:12 PM IST

ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. సచివాలయంలో 1వ బ్లాక్ లో 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కు మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. ఇందుకుగాను ముందుగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, సీఎంవో ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంటారు. ఈ కమిటీ జిల్లాల ఏర్పాటులో ఖర్చును నియంత్రించడం సహా వివిధ అంశాలను అధ్యయనం చేయనుంది. వీలైనంత త్వరలో కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

మరింత మందికి వైఎస్సార్ చేయూత

మరింత మందికి వైఎస్సార్ చేయూత పథకం అందించే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 45-60 ఏళ్ల మధ్యనున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే పింఛన్ అందుకుంటున్న సుమారు 8.21 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలకు అదనంగా వైఎస్ ఆర్ చేయూత వర్తింప జేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6163.59 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

ఇసుక కార్పొరేషన్ ఏర్పాటు

ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఏపీఎండీసీ కింద ఇసుక కార్పొరేషన్‌ ఉండగా.. పనిభారాన్ని తగ్గించేందుకు కొత్తగా ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇసుక మినహా మిగతా ఖనిజాల వ్యవహారాలన్నీ ఏపీఎండీసీకి అప్పగించారు. ఇసుక కార్పొరేషన్‌పై ముగ్గురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీలో కొడాలినాని, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ ఇసుక తవ్వకం, సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వనుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.

జీవో నెం.22 ఆమోదం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించి జీవో నెం. 22ను కేబినెట్‌ ఆమోదించింది. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలల్లో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. తొలి దశ పనులకు ఇప్పటికే కేటాయించిన రూ.920 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఎస్ యూవీ

రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, కాల్వల విస్తరణ పనుల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు, డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ప్రభుత్వం కంపెనీగా వ్యవహరించనున్న ఈ సంస్థలో క్యాపిటల్‌ అవుట్‌ లే గా రూ.40 వేల కోట్లుతో..వరద నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడానికి పనులు చేపట్టనున్నారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వచేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది.

25 ఏళ్లకు పీపీఏ ఒప్పందాలు

ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్‌ యాక్ట్‌ 2006 సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని మంత్రి వర్గం తీర్మానం చేసింది. రెన్యుబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ విధానం 2020కి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రం వెలుపల రెన్యుబుల్‌ ఎనర్జీ ఎగుమతికి వీలుగా విధానం రూపొందించాలని నిర్ణయించింది. సంప్రదాయేతర కరెంటు ఉత్పత్తి, ఆ ప్రాజెక్టులకు ప్రోత్సాహం, పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా ఈ రంగంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రైతులకు పగటిపూట ఉచిత కరెంటు ఇచ్చేందుకు తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చేలా, వీలైనంత ఆర్థిక భారం తగ్గేలా ఒప్పందం చేసుకోవాలని మంత్రి వర్గం ఆమోదించింది. ఇకపై 25 ఏళ్లకు పీపీఏ కుదుర్చుకోవాలని నిర్ణయించారు.

ఆక్వారైతులకు నకిలీ ఫీడ్‌ల బెడదనుంచి విముక్తి కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్‌ 2020కి మంత్రి వర్గం ఆమోదించింది. ఈ చట్టం ద్వారా అనైతిక చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా, రైతులకు నాణ్యమైన ఫీడ్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం

పలుశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదించింది. 5701 కొత్త పోస్టుల భర్తీతోపాటు చాలా కాలంగా భర్తీ కాకుండా ఉన్న 4011 పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేశారు. 31 స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్ల పోస్టులను అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్‌కు కేబినెట్‌ ఆమోదించింది. సీఐడీలో 10 జూనియర్‌ అసిస్టెంట్లు, 10 స్టెనో పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 13 పోస్టులు డిప్యుటేషన్‌ ప్రాతిపదికన, 1 కాంట్రాక్టు ప్రాతిపదికన, 14 పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మంజూరు చేశారు.

కడప జిల్లా వెంకటంపల్లెలో వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ కింద ఉన్న అరటి పరిశోధనా సంస్థలో 11 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ అంగీకరించింది. వీటిలో 5 టీచింగ్‌ పోస్టులు, 6 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.ఆచార్య ఎన్జీరంగా యూనివర్శిటీ గుంటూరులో హోంసైన్స్‌ విభాగంలో 2 ప్రొఫెసర్, 4 అసోసియేట్‌ ప్రొఫెసర్ల మంజూరుకు సమావేశం ఆమోదించింది. ఏపీ స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్‌ పోస్టు మంజూరుచేసింది.

కేసులు ఉపసంహరణ

గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరణకు కేబినెట్‌ ఆమోదించారు. సీపీఎస్‌ ఉద్యమంలో భాగంగా టీచర్లు, ఇతర ఉద్యోగలుపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ గ్యారేంటీతో రూ.2 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతించారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో రూ. 5 కోట్లతో గొర్రెల పెంపకందార్ల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించింది. అనంతపురం జిల్లాలో మరో గొర్రెల పెంపకందార్ల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లా కొమ్మమర్రిలో రూ.9 కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటునకు కేబినెట్ ఆమోదించింది.

ఇదీ చదవండి : కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.