ETV Bharat / city

పూర్తి భద్రతా చర్యల అనంతరమే విద్యాసంస్థలు తెరవాలి: సోము వీర్రాజు - somu veerraju comments on educational institutions news

పూర్తి రక్షణాత్మక చర్యలు తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభించాలని భాజపా డిమాండ్​ చేసింది. ఇప్పటికే ఏపీలో కరోనా విజృంభిస్తున్నందున.. విద్యాసంస్థలు ఒకేసారి తెరవడం వల్ల మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు.

పూర్తి భద్రతా చర్యల అనంతరమే విద్యాసంస్థలు తెరవాలి: సోము వీర్రాజు

author img

By

Published : Aug 14, 2020, 4:32 PM IST

somu veerraju
భాజపా ప్రకటన

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే.. విద్యా సంస్థలు దశలవారీగా ప్రారంభించాలని భాజపా డిమాండ్​ చేసింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్​ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకేసారి కళాశాలలు, జూనియర్​ కళాశాలలు, పాఠశాలలు పునఃప్రారంభించడం వల్ల కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అమెరికాలోనూ ఒకేసారి విద్యాసంస్థలు ప్రారంభించడం వల్ల 80 వేల మంది వైరస్​ బారిన పడ్డారని సోము వీర్రాజు తెలిపారు. అందువల్ల పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే.. ప్రభుత్వం విద్యాసంస్థలు ప్రారంభించాలని సూచించారు.

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలు, భాజపా కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి..

'రాజధానిపై ప్రభుత్వ తీరు మారే వరకు రైతుల దీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.