ETV Bharat / city

తెలంగాణలో ఈఎస్​ఐ కుంభకోణం... మరొకరు అరెస్టు

తెలంగాణలో ఈఎస్​ఐ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు... మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

అనిశాకు పట్టుబడిన శ్రీనివాస్​రెడ్డి
author img

By

Published : Nov 1, 2019, 7:59 PM IST

తెలంగాణలో ఈఎస్​ఐ కుంభకోణం... మరొకరు అరెస్టు

తెలంగాణలోని కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌)... మందుల కొనుగోలు కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. తేజ ఫార్మసీ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన విచారణ అధికారులు పెద్దఎత్తున బిల్లులు, నకిలీ ఇండెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి- శ్రీనివాస్‌రెడ్డిల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. కాగా శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అధికారులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇదీ చూడండి: ఆరోగ్య మంత్రి హెచ్చరికలతో సమ్మె విరమణ

TG_HYD_39_01_ACB_ARRESTED_SRINIVAS_REDDY_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:డెస్క్‌ వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. దీంతో పాటు ఫైల్‌ విజువల్స్‌ కూడా వాడుకోగలరు. కార్మిక బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు కుంభకోణంలో మరొకరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. తేజ ఫార్మీ ఎండి రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ కేసులో అరెస్టు సంఖ్య 17కు చేరింది. దేవికారాణి శ్రీనివాస్‌రెడ్డి పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు విచారణ బృందం గుర్తించింది. దేవికారాణి డొల్ల కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నట్టు అనిశా దర్యాప్తులో బయటపడింది. దండుకున్న డబ్బులతో ఆమె భారీగా బంగారం కొనుగోలు చేసినట్టు అనిశా భావిస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో సోదాలు జరిపిన విచారణ అధికారులు బిల్లులు, నకిలీ ఇండెంట్లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అధికారులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.