ETV Bharat / city

తెలంగాణ: సచివాలయ ఉద్యోగులను కలవరపెడుతున్న కరోనా - telangana secretariat employee corona

తెలంగాణలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. తాజాగా సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది.

తెలంగాణ సచివాలయ ఉద్యోగులను కలవరపెడుతున్న కరోనా

author img

By

Published : Jun 14, 2020, 1:18 PM IST

తెలంగాణ సచివాలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరొకరికి కరోనా సోకింది. ఐటీ శాఖలో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందిలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్​ నిర్ధరణ అయింది. గత ఐదు రోజులుగా సదరు ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదు. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో బీఆర్కే భవన్​లో ఐటీ విభాగం ఉన్న రెండో అంతస్తులో కలవరం మొదలైంది.

ఇప్పటికే ఆర్థిక శాఖలో ఇద్దరికి కరోనా సోకడంతో ఆ శాఖలోని ఉద్యోగులు ఎవరూ విధుల్లోకి రావడం లేదు. బీఆర్కే భవన్​లోకి సందర్శకులను కూడా అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చే వారైతే సంబంధిత అధికారుల అనుమతితోనే లోపలికి పంపిస్తున్నారు. అధికారులు కూడా వీలైనంత మేరకు ఎవరికీ అపాయింట్​మెంట్లు ఇవ్వడం లేదు.

ఇదీ చూడండి: చంద్రబాబు ఇంటి వద్ద విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్‌కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.