హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు / ట్రైబ్యునళ్లు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూలై 15 వరకు వాటిని పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కరోనా వ్యాప్తి నేపథ్యంలో బేషరతుగా జూన్ 30 వరకు పొడగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 28న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మరోసారి విచారణకు రాగా జూలై 15 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి:
SRISAILAM DAM: 'విద్యుదుత్పత్తి పెరిగిపోతోంది.. తెలంగాణను నిలువరించండి'