ETV Bharat / city

covid vaccination: '94శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్​ పూర్తి'

రాష్ట్రంలో 94 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్​ పూర్తైనట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ అన్నారు. త్వరలోనే 100 శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

andhra pradesh education minister adhimulapu suresh

author img

By

Published : Aug 31, 2021, 8:35 PM IST

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగతోందని.. ఇప్పటికే 94 శాతం మందికి కొవిడ్​ టీకా వేయడం పూర్తయిందనీ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. కేవలం 15,083 మంది ఉపాధ్యాయులకు మాత్రమే వాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. త్వరలోనే 100 శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖపట్నంలో ఇప్పటికే 100 శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని, కడపలో 99 శాతం, విజయనగరం, చిత్తూరు, నెల్లూరులో 98 శాతం, ఉపాధ్యాయులు వాక్సిన్ వేయించుకున్నారని మంత్రి సురేశ్​ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే 86 శాతం పూర్తయిందని.. అక్కడ ఇంకా 4 వేల మందికి టీకా వేయాల్సి ఉందని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రం మొత్తంలో సగటు 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు మంత్రి సురేశ్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:

రేపు, ఎల్లుండి కడప జిల్లాలో సీఎం జగన్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.