రాజధాని పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీని ఆపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి విడివిడిగా లేఖలను ఈ-మెయిల్ ద్వారా పంపారు.
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన తమకు న్యాయం చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వం తమను అన్ని రకాలుగా మోసం చేయటంతో.. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఈ కేసుల్లో తుది తీర్పు వచ్చే సమయంలో ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తే అది తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి