పరిపాలనా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రార్థిస్తూ.. గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మహిళలు ప్రసాదాలు పంపిణీ చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. వారు చేస్తున్న ఆందోళనలను 459వ రోజు సైతం కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, అనంతవరం గ్రామాల్లో నిరసన దీక్షలు చేశారు.
ఎస్సీలంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినపుడు.. అక్రమాలు ఎక్కడ జరిగాయో చెప్పాలని రైతులు ప్రశ్నించారు. అమరావతికి అండగా నిలిచేవాళ్లను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. తమకు న్యాయదేవత అండగా ఉన్నన్ని రోజులూ ప్రభుత్వం ఎలాంటి కుయుక్తులు పన్నినా నిలవబోవని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: