ETV Bharat / city

'ఇది పోలీసు రాజ్యమా.. ప్రజారాజ్యమా..?' - three capitals andhrapradesh

పోలీసులు మహిళలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. మహిళలను రాత్రి 9 గంటల వరకు పోలీసు స్టేషన్​లో ఉంచి కులం గురించి అడగటంపై మండిపడ్డారు.

amaravathi jac on women arrest
మహిళల అరెస్టుపై అమరావతి పరిరక్షణ సమితి
author img

By

Published : Jan 11, 2020, 10:41 AM IST

మహిళల అరెస్టుపై అమరావతి పరిరక్షణ సమితి

వైకాపా ప్రభుత్వం 144 సెక్షన్​తో అమరావతి పోరాటాన్ని అణగదొక్కాలని చూస్తోందని అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. విజయవాడలో మాట్లాడిన పరిరక్షణ సమితి నేతలు.. మహిళలను కులం పేర్లు అడిగి కించపరచడాన్ని ఖండించారు. రాత్రి 9 గంటల వరకు వారిని పోలీసుస్టేషన్​లో ఉంచడమేంటని నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. 'ఇది పోలీసుల రాజ్యమా.. ప్రజారాజ్యమా' అని నిలదీశారు.

రేపట్నుంచి పోలీసుస్టేషన్లకు వెళ్లి పండ్లు ఇచ్చి సహకరించాలని కోరతామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలన్నారు పరిరక్షణ సమితి నేతలు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి

కొత్త రాజధానుల నిర్మాణానికి మూలసూత్రం ఇదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.