గుంటూరు జిల్లా తుళ్లూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల ఆందోళనల సెగ తగిలింది. శాసన సభ్యురాలు ఈ కార్యక్రమానికి వెళ్లేముందు, ముగించుకుని వెళ్తునప్పుడూ రైతులు, మహిళలు గోబ్యాక్..... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తమను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన శాసనసభ్యురాలు క్షమాపణలు చెప్పిన తర్వాతే అమరావతిలో పర్యటించాలని రైతులు నినాదాలు చేశారు. శ్రీదేవి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు రోడ్డు పైకి రాకుండా నిలువరించారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే తమనే కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: